నిన్ను వదలను రవి ప్రకాష్ – విజయసాయిరెడ్డి

నిన్ను వదలను రవి ప్రకాష్ - విజయసాయిరెడ్డి

0
127

మొత్తానికి సుద్ద నీతి వాఖ్యాలు చెప్పే టీవీ రవిప్రకాష్ ని ఇక రవిప్రకాష్ అని పిలవాలి.. ఎందుకు అంటే సీఈవో పదవి నుంచి రవిప్రకాష్ ని యాజమాన్యం బయటకు పంపేసింది.. అయితే మీరేంటి తీసేది నేనే రాజీనామా చేస్తున్నా అంటూ రవిప్రకాష్ తన రాజీనామా లేఖపంపారు.. ఇప్పుడు వైసీపీ నేతలు మాత్రం రవి ప్రకాష్ పై మంచి స్పీడుగా విమర్శలు చేస్తున్నారు.. జగన్ పై విషం చిమ్మిన మీడియాగా టీవీ9ని ఇప్పటికీ చెబుతారు, సీబీఐ కేసుల విషయంలో జైలులో ఉన్న సమయంలో అతి చేశారు అని విమర్శిస్తారు.. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు రవిప్రకాష్ పై సటైర్లు వేస్తున్నారు.. ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ట్వీట్ల తో తన వరుస బాణాలు వదులుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా రవిప్రకాష్ పై ఓ ట్వీట్ సందించారు. ఇప్పుడు ఇదే పొలిటికల్ మీడియా సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.

మెరుగైన సమాజ ఉద్యమకారుడు శుక్రవారం మధ్యహ్యం3గం. నుంచి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేశాడట. సైబరాబాద్ ఎస్వోటి పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి వెళ్తే 23 తర్వాత దొరికే ప్రమాదం ఉండటంతో కర్నాటక మీదుగా ముంబాయి చేరినట్టు సమాచారం. నన్నెవరూ టచ్ చేయలేరని బీరాలు పలికి పరారీలో ఎందుకున్నావు ప్రవక్తా?