బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిందా అంటే, అవుననే అనిపిస్తోంది ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో.. దుబ్బాక గెలుపుతో ఇటు కాంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణలో బీజేపీ తన సత్తా చాటుతోంది అనేది తేలిపోయింది అంటున్నారు విశ్లేషకులు, ఇటు తెలంగాణలో ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ పార్టీకి బీజేపీ పత్యామ్నాయ శక్తిగా ఉంది అంటున్నారు.ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయం. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది.
అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఇప్పటికే ఆమె బీజేపీలో చేరుతున్నారు అని పలు వార్తలు వినిపించాయి, దాదాపు కొన్ని రోజులుగా ఈ వార్తలు వినిపిస్తున్నా కాంగ్రెస్ నేతలు ఆమెని పార్టీలో కొనసాగించాలి అని చర్చలు జరుపుతున్నారు.
కాని ఇటీవల ఆమె బీజేపీ నేతలను కలవడంతో ఇక ఆమె బీజేపీలో చేరుతారు అనేది ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట.కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కచ్చితంగా గ్రేటర్ లో తన సత్తా చాటాలి.. లేకపోతే ఆ ప్లేస్ ని బీజేపీ తీసుకుంటుంది అని విశ్లేషకులు అంటున్నారు, మరి బీజేపీ నుంచి విజయశాంతి తన రాజకీయ అడుగులు వేశారు, మళ్లీ ఆమె బీజేపీలో చేరుతున్నారు అని వార్తలు వస్తున్నాయి, మరి ఆమె దీనిపై ఏమంటారో చూడాలి.