విశాఖలో చంద్రబాబుకు భారీ షాక్

విశాఖలో చంద్రబాబుకు భారీ షాక్

0
90

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే వైసీపీ తీర్థం తీసుకున్నారు.. ఇప్పటికే ఈ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే…

తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… ఆయనతోపాటు మాజీ కార్పొరేటర్ పిఎల్ ఎస్ ఎన్ ప్రసాద్ అలాగే మూర్తి తదితరులు వైసీపీ తీర్థం తీసున్నారు..

జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను చూసే తాము వైసీపీలో చేరామని స్పష్టం చేశారు… కాగా ఇప్పటికే పులివెందుల సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, డొక్కా, ఐజయ్య, కరణం బలరాం వంటి వారు టీడీపీకి గుడ్ బై చెప్పారు…