వైసీపీకి బిగ్ షాక్ సీమలో టీడీపీలోకి వలసల పర్వం…

వైసీపీకి బిగ్ షాక్ సీమలో టీడీపీలోకి వలసల పర్వం...

0
127

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన తృతియ శ్రేణినాయకులు టీడీపీ గూటికి చేరుతున్నారు… ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో తృతియశ్రేణి నాయకుల వలసలు పర్వం ఎక్కువ అవుతోంది…

తాజాగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీ తీర్ధం తీసుకున్నారు.. పార్టీలోకి చేరేందుకు వచ్చిన వారందరిని ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు… వారందరికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024లో పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు… మళ్లీ చంద్రబాబు నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు చూస్తాని అన్నారు… కాగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 14కు 14 సీట్లనుకైవసం చేసుకున్న సంగతి తెలిసిందే…