వైసీపీ నేతలను సైకో అన్న లోకేశ్

వైసీపీ నేతలను సైకో అన్న లోకేశ్

0
123

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేటీఎమ్ బ్యాచ్ అవగాహనా రాహిత్యానికి నా సానుభూతని లోకేశ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి విద్వేష మనస్తత్వంలో మార్పు రాలేదని అన్నారు. 6 నెలల్లో ఏమి చేసారో చెప్పుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్న వైసీపీ నాయకులు మరోసారి కుల రాజకీయాన్ని తెరపైకి తెచ్చారని లోకేశ్ ఎద్దేవా చేశారు…

అమరావతి గ్రాఫిక్స్ అంటూ వైసీపీ చిల్లర గ్యాంగ్ చేసిన చీప్ ట్రిక్స్ కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
తాజా పర్యటనతో ఫుల్ స్టాప్ పడిందని దాంతో దిక్కుతోచని స్థితిలో ఇంకో కొత్త కథ అల్లుతున్నారని లోకేశ్ ఆరోపించారు. ఎస్సీలను కింద కూర్చోబెట్టి అవమానిస్తారా? అంటూ వారి అసలైన గ్రాఫిక్ ప్రతిభను చూపిస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు

చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న వారంతా ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారే అని వైసీపీ సైకోలకు తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు… ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని మండిపడ్డారు. విధ్వంసంతో ప్రారంభం అయిన వైసీపీ ఆరు నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ప్రదేశ్ గా మార్చారని ఆరోపించారు