విజయసాయిరెడ్డిని మెచ్చుకున్న జగన్ మీ ప్లాన్ సూపర్

విజయసాయిరెడ్డిని మెచ్చుకున్న జగన్ మీ ప్లాన్ సూపర్

0
109

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా దూసుకుపోతున్నారు ..ముఖ్యంగా ఎన్నికల సమయం కావడంతో రాజకీయ పార్టీల నుంచి నేతలు టిక్కెట్లు ఆశించి వైసీపీలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. అయితే కొందరు వైసీపీ పిలుపు మేరకు చేరడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు అందరూ వైసీపీ పంచన చేరి జగన్ తో మంతనాలు జరిపి సీటు లేదా అధికారంలోకి వస్తే మంచి కీలక పదవి ఇవ్వాలి అని హామీలు తీసుకుంటున్నారు .మాజీలు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. అయితే జగన్ కూడా వారి ఉపయోగం పార్టీకి ఉంటుంది అనుకుంటే వెంటనే పార్టీలోకి సాదర ఆహ్వనం పలుకుతున్నారు.

ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలువురు తెలుగుదేశం నాయకులు వైసీపీలో చేరేందుకు వెనుక నుంచి పథక రచన చేస్తున్నారు. ఆయన వ్యూహాలతో కొందరు తెలుగుదేశం నేతలు వైసీపీ లో చేరుతున్నారు ..తాజాగా టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నేడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఆయన వైసీపీలో చేరేందుకు కారణం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాయబారం కారణం అని జగన్ కు తెలుసు. ఆయన చేరితే ఒంగోలు ఎంపీ సెగ్మెంట్లో వైసీపీకి తిరుగులేని విజయం వస్తుంది అని ఆలోచించారు. ఆయనకు వైసీపీ తరపున ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా జగన్ రెడీ అయ్యారు అయితే బాబాయ్ వైవీకి రాజ్యసభ సీటు ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. అందుకే మాగుంట ఎంట్రీ అనే వార్తతో విజయసాయిరెడ్డికి జగన్ అభినందనలు తెలియచేశారట.