బిగ్ బాస్ కౌశల్ తో టీడీపీ కొత్త ఒప్పందం ఆశ్చర్యపోతారు

బిగ్ బాస్ కౌశల్ తో టీడీపీ కొత్త ఒప్పందం ఆశ్చర్యపోతారు

0
102

బిగ్ బాస్ తెలుగు టైటిల్ 2 విన్నర్ కౌశల్, ఇక కౌశల్ ఎంత క్రేజ్ సంపాదించారో ఇప్పుడు అంతే రివర్స్ అవుతున్నారు ఆయన అభిమానులు. అయితే ఇప్పుడు దేశంలో ఎన్నికల సమయం కావడంతో , ఆంధ్రప్రదేశ్ లో కౌశల్ క్రేజ్ పార్టీలకు కూడా అవసరం అయింది. ముఖ్యంగా విశాఖకు చెందిన కౌశల్ గతంలో సీఎం చంద్రబాబు ని కలవడంతో ఆయన తెలుగుదేశంలో చేరుతారు అని అనుకున్నారు. కాని ఆయన తెలుగుదేశం అధినేతకు సాధారణంగా కలిశారు అని వార్తలు వచ్చాయి.

అయితే తెలుగుదేశం పార్టీలో ఆయన చేరే అంశం చర్చలు జరుపుతున్నారు అని అనుకున్నారు.. కాని ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం కౌశల్ ని తెలుగుదేశం పార్టీకి క్యాంపెయినర్ గా ఉపయోగించుకోవాలి అని చూస్తున్నారు.. విశాఖలో మూడు సెగ్మెంట్లపై కచ్చితంగా కౌశల్ ప్రభావం చూపుతారు. అందుకే కౌశల్ చేత ఇక్కడ ఆరు రోజుల ప్రచారం చేయించాలి అని, అలాగే మిగిలిన చోట్ల కాస్త తెలుగుదేశం పార్టీకి ఉపయుక్తం అవుతుంది అనేచోట కౌశల్ తో ప్రచారం చేయించాలి అని చూస్తున్నారట.

ఇప్పుడు విశాఖ నగరంలో ఇదే చర్చ జరుగుతోంది. సో కౌశల్ ఇలా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ అనే వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. అయితే కౌశల్ కు ఉన్న క్రేజ్ మాత్రం ఉపయోగించుకుంటే ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.