పులివెందులలో జగన్ ఓటు మిస్ షాక్ లో వైయస్ ఫ్యామిలీ

పులివెందులలో జగన్ ఓటు మిస్ షాక్ లో వైయస్ ఫ్యామిలీ

0
135

మొత్తానికి రాజకీయం సరికొత్త దారులు చూస్తోంది అని చెప్పాలి .ఓ వైపు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో, ఎన్నికల సందడి ఏపీలో మొదలైంది.. అయితే ఏపీలో ఎన్నికలకు ముందే ఏకంగా ఈ ఓట్ల తొలగింపు అంశం పెద్ద రచ్చకు దారితీసింది. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ కు వైసీపీ తెలుగుదేశం వీరు కారణం అంటే వీరు కారణం అని పోటీగా కంప్లైంట్స్ ఇచ్చారు. మరో పక్క 27 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది .ఇక ఈసమయంలో జగన్ ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి, అలాగే బాబు ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటికి నిలపాలి అని పార్టీ తరపున మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సమయంలో ఓట్ల తొలగింపు అంశం తీవ్రంగా చర్చకు వస్తోంది.

ఈసారి ఏకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటునే తొలగించేందుకు కుట్ర పన్నారు కొందరు . వైఎస్ జగన్ ఫొటోతో కూడిన ప్రొఫైల్ను అప్లోడ్ చేసి ఆన్లైన్ ద్వారా ఫారం–7 దాఖలు చేశారు. వైఎస్ జగన్ పేరు మీద ఈనెల 9న దరఖాస్తు దాఖలయ్యింది. అయితే ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది. దీంతో జగన్ బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి దీనిపై కంప్లైంట్ ఇచ్చారు. ఇలాంటి కుట్ర చేసింది ఎవరు అని, వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని కోరారు.జగన్మోహన్రెడ్డి సమీప బంధువు జనార్దనరెడ్డిని దీని గురించి వివరణ అడగగా, ఓటు తొలగించాలి అని ఎక్కడా జగన్మోహన్రెడ్డి దరఖాస్తు చేయలేదని చెప్పారు. రిటర్నింగ్ అధికారి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే అలాగే వైయస్ వివేకానందరెడ్డి ఓట్లు తొలిగించిన విషయం తెలిసిందే.