జగన్ సీక్రెట్ మంతనాలు ఎవరితో?

జగన్ సీక్రెట్ మంతనాలు ఎవరితో?

0
93

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతలకు అందుబాటులో లేరు, అయితే పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజకీయంగా అన్ని విషయాలు చక్క పెడుతున్నారట.. అయితే జగన్ ఎందుకు నేతలతో ఇప్పుడు చర్చలు జరపడం లేదు, అంటే కేవలం ఆయన కొందరు పార్టీ సీనియర్లు ఆయనకు రాజకీయ సలహాలు ఇచ్చిన వారితో సర్వేల గురించి చర్చిస్తున్నారట.. గత ఎన్నికల్లో తమకు జీరో స్ధానాలు ఇచ్చిన పశ్చిమగోదావరి జిల్లా అలాగే కర్నూలు చిత్తూరు జిల్లాల ఫలితాల గురించి నాయకులతో చర్చలు జరిపారట.. ఇప్పుడు వచ్చిన సర్వేలు గతంలో మనకు ఫేవర్ గా వచ్చిన సర్వేలు, అలాగే అభ్యర్దుల ఎంపిక ముందు అభ్యర్దుల ప్రకటన తర్వాత, ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది అని పలు విషయాలపై నేతలతో చర్చలు జరుపుతున్నారట.

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండు మూడు స్ధానాలు మినహా మిగిలినవి వైసీపీ గెలుచుకుంటుంది అని తెలుస్తోంది.. ఇక వైసీపీకి మెజార్టీ స్ధానాలు రాయలసీమలో వస్తాయి అని చెబుతున్నారు.. తెలుగుదేశం పార్టీకి మరోసారి పశ్చిమగోదావరిలో పాజిటీవ్ రిజల్ట్ వస్తుంది అని వార్తలు వస్తున్నాయి.. కాని ఇది అవాస్తవం అని తేలిందట .. వైసీపీ పశ్చిమలో 10 స్ధానాలు గెలుస్తుంది అని మిగిలిన ఐదు స్ధానాల్లో రెండు జనసేన మూడు టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలిందట.