సోషల్ మీడియా గురించి వైఎస్ షర్మిల అద్భుతమైన స్పీచ్

0
42

అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా .. వైఎస్ షర్మిల కొత్త వెబ్ సైట్ ను బుధవారం లోటస్ పాండ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా గురించి ఆమె స్పీచ్.. ఆమె మాటల్లోనే…

మీ అందరికి .. సోషల్ మీడియా సైనికులందరికి ముందుగా శుభాకాంక్షలు. ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టేది న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ .. నాలుగోది మీడియా..ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాది ప్రత్యేకమైన స్థానం .. పాలకులకు .. ప్రజలకు మధ్య వారధిగా పనిచేసి ప్రజాసమస్యలను పాలకుల దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి మార్గం చూపే మీడియా ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిముఖ్యమైనది .

కానీ ఇప్పుడు ఒకటి రెండు మీడియా సంస్థలు మినహాయిస్తే .. మిగిలిన సంస్థలన్నీ అధికారంలో ఉన్నవారికి అనుకూలంగానే ఉంటున్నాయి. పాలకులకు వంతపాడే ఛానల్ లతో ఇక ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ రోజు రోజుకు పతనమౌతున్న పరిస్థితిలో .. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎవరు రక్షణ కల్పించినా .. కల్పించకపోయిన .. ప్రజలే ఈ రోజు దానిని కాపాడుకుంటున్నారు .. ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్షణగా ఈ రోజు ప్రజల నుంచి పుట్టిందే .. సోషల్ మీడియా .. అదే ప్రజాస్వామ్యానికి .. ఫిఫ్త్ ఫిల్లర్.

ఈ రోజు మీడియా ప్రజాసమస్యలను పట్టించుకోకపోయినా .. ప్రజాసమస్యలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ పోరాడుతున్న మీరంతా నిజమైన సమాజ రక్షకులు .. సమాజానికి దిశానిర్దేశకులు. మీది ఆర్మీలో మార్షల్ స్థానం ఐతే ..
మిమ్మల్ని ఫేస్బుక్ లో ఫాలో అయ్యే 5 వేల మంది .. ట్విట్టర్ లో ఫాలో అయ్యే .. 3 వేల మంది .. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే మరో 1000 మంది .. మీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసిన వారంతా మీ సైనికులుగా .. మీరు నడిపే వాట్స్ అప్ గ్రూప్ లు అందరు కలసి ప్రజాసమస్యల పైన పోరాడే సైనికులలాంటి వారు మీరంతా.

ఒక్కప్పుడు మీడియా ఏది చెపితే పబ్లిక్ అంత అదే చూసేవారు .. కానీ ఇప్పుడు పబ్లిక్ చెప్పిందే మీడియా చూపెట్టే పరిస్థితికొచ్చింది అంటే అదంతా సోషల్ మీడియా ఘనత. మీరు చేసే సమాజ సేవకు మీకు దక్కే బహుమానం .. ఒక షేర్ .. ఒక లైక్ .. ఒక క్లిక్, మిమ్మల్ని మరింత ఉత్సహవంతంగా పనిచేసేలా చేసేవే ఈ లైక్స్ .. షేర్స్. ఈ రోజు సోషల్ మీడియా సైనికులు లేకుండా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు ..

ఒక మంచిపని చేయాలన్న .. ఒక చెడ్డ పని జరుగకుండా ఆపాలన్న .. అదంతా సోషల్ మీడియా .. మీ చేతుల్లోనే ఉంది.
ఒకప్పుడు ప్రశ్నించే వాడికి మీడియా సమయం ఇచ్చేది కాదు .. ఈ రోజు ప్రశ్నించే వాడికోసమే పుట్టింది సోషల్ మీడియా. అదే పబ్లిక్ మీడియా. సినిమాలో హీరోలా .. డాన్సులు .. ఫైట్స్ చేసే రీల్ హీరోలు కాదు మీరు .. ప్రశ్నించే తత్వాన్ని .. నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకునడిపిస్తూ .. ప్రశ్నిస్తూ .. ప్రతి రోజు పక్కన ఉన్నవారిని చైతన్యపరుస్తూ ఎప్పుడు ప్రజాసమస్యల పై పోరాడే రియల్ హీరోస్ మీరంతా.

మనకు సొంత మీడియా లేదు .. మీరంతా ఉండంగా .. దాని అవసరం కూడా లేదు .. రాదు. మన కార్యక్రమాలను ఈ రోజు ముందుకు తీసుకపోయేది మీరే .. ప్రపంచాన్ని ప్రస్తుతం గజగజలాడిస్తున్న ప్రధాన సమస్య ఫేక్ న్యూస్ .. ఫేక్ న్యూస్ తో తప్పుడు వార్తలు సృష్టించి కొందరు .. కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారు .. మత కల్లోలాను సృష్టిస్తున్నారు .. మన వ్యవస్థని దెబ్బతీస్తూ .. ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు, కానీ దానిని నిరోధించాల్సిన చాల పెద్ద బాధ్యత మీ భుజాల పైన ఉంది.

ఫేక్ న్యూస్ దాడి జరిగినప్పుడు .. దానికి పదింతల బిగ్గరగా చెప్పి నిజాలను ముందుకు తీసుకెళ్లి తిప్పికొట్టాల్సింది మీరే,
సోషల్ మీడియా వారియర్స్ కు ఫేక్ న్యూస్సే పెద్ద ఛాలెంజ్ .. దానిని తిప్పికొట్టడంలో మీరంతా ముందుంటారని నేను నమ్ముతున్నాను. మనం కలుసుకుందామని అనుకున్న మూడు రోజుల్లోనే మీరంతా నన్ను కలుసుకోవడం చాల ఆనందంగా ఉంది, నేను ఈ గడ్డ మీద నిలబడగలిగాను అంటే దానికి కారణం మీరే, ప్రజాసమస్యల పై కొట్లాడటానికి వచ్చిన నేను .. మీరుంటేనే నేను ఉంటాను. మన పోరాటం మరింత ముందుకు తీసుకపోయేది మీరే,

మనం అనుకున్న సిద్ధాంతాలను .. మనం చేయబోయే పోరాటాలను .. మీరు చేసే షేర్లు .. కామెంట్స్ .. లైక్స్ .. ఫొటోస్ .. క్యాప్షన్స్ .. తో ప్రజల్లోకి మరింత తీసుకుపోతారనే నమ్మకం నాది, మనమంతా ఒక్కటి .. మనమంతా ఓకే టీం .. అదే YSSR – TEAM. మీరు చేసే ప్రతి షేర్ .. మన పార్టీకి ఒక కార్యకర్తను తయారుచేయడంతో సమానం. యుద్దాలు యుద్ధ భూమిలో జరుగుతాయి .. పోరాటాలు రణ భూమిలో జరుగుతాయి .. కానీ ఎన్నికల రణరంగం .. మాత్రం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.

ఒకపార్టీకి .. ఒక నాయకునికి పరుగెత్తి పనిచేసే కార్యకర్త యెంత ముఖ్యమో మీరు అంతే ముఖ్యం ..మీరు 10 మందికి షేర్ చేయడమంటే మన పార్టీకి పది మంది కార్యకర్తలను తయారుచేయడమే. ఈ రోజు సోషల్ మీడియా సైనికులను భయపెట్టడానికి .. పాలక వర్గాలు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేయొచ్చు కానీ .. వాక్ స్వతంత్రం .. భావప్రకటన స్వేచ్ఛ మన హక్కు .. ఎవరిని కించపరచనంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అక్రమ కేసులకు ఎవరు బెదిరిపోవాల్సిన పనిలేదు .. మీకు తోడుగా నేను ఉన్నాను .. మీ రక్షణకై నేను నిలబడుతాను.

మరొక్కసారి మీ అందరికి అంతర్జాయతీయ సోషల్ మీడియా దినోత్సవ శుభాకాంక్షలతో .. జోహార్ YSR .. జై తెలంగాణ.