వైసీపీలో యాక్టీవ్ అయిన వైవీ

వైసీపీలో యాక్టీవ్ అయిన వైవీ

0
126

వైసీపీలో ఆయన చాలా ప్రముఖ పాత్ర పోషించారు… ముఖ్యంగా పార్టీలో ఆయన కింగ్ లా ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పారు.. జగన్ సీఎం అవ్వాలి అని కలలు కూడా కన్నారు.. చివరకు జగన్ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన సమయంలో ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన అలకబూనారు. ఆయన జగన్ కు బాబాయ్ అవుతారు, ఆయనే వైవీ సుబ్బారెడ్డి, తాను పార్టీలో ఎలా ఉన్నాను అనేది అందరికి తెలుసు. అయితే టికెట్ రాలేదు అని పార్టీ మారిపోయే టైపు సుబ్బారెడ్డి కాదు అని అందరూ భావించారు. ఆయన జగన్ కోసం ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.

ఒంగోలు ఎంపీ టికెట్ దక్కకపోవడం, తన రాజకీయ శత్రువు, బావమరిది బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అలకపాన్పు ఎక్కిన వైవి అలకవీడారు.. ఎన్నికల ముందు నుంచి అలక పాన్పు ఎక్కిన ఆయన పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా పార్టీ కార్యకలాపాల్లో అంతగా పాల్గొనలేదు. ఇక తాజాగా మాత్రం ఆయన వైసీపీ తరపున తన వాయిస్ వినిపిస్తున్నారు.జగన్ సుబ్బారెడ్డికి నామినేటెడ్ పదవి ఇస్తాను అని చెప్పారట. అందుకే వైవీ కూడా మరింత యాక్టీవ్ గా పార్టీలో ఉన్నారు అని చెబుతున్నారు.