లక్ష్మీ పార్వతికి గుడ్ న్యూస్ చెప్పిన జగన్ కీలక పదవి

లక్ష్మీ పార్వతికి గుడ్ న్యూస్ చెప్పిన జగన్ కీలక పదవి

0
413

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్ ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఆయనకు నేతలు చాలా మంది సాయం చేశారు.. వారు అందరూ పార్టీ మారకుండా జగన్ వెంటే ఉన్నారు ..అయితే జగన్ అందుకే కొందరు కీలక నేతలకు తను సీఎం అయిన తర్వాత కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే నామినేటెడ్ పదవులు ఇచ్చారు.

ఈ సమయంలో పార్టీ తరపున వాయిస్ బాగా వినిపించిన వారిలో మాజీ సీఎం, నటుడు నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీ పార్వతి ఒకరు. జగన్ సీఎం అవ్వాలని కాంక్షించిన వారిలో ఆమె కూడా ఒకరు.. అయితే ఆమెకు కొద్ది రోజులుగా కీలక పదవి వస్తుంది అని వార్తలు వినిపించాయి .. తాజాగా ఆమెకు కీలక పదవి ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

లక్ష్మీ పార్వతిని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమిస్తూ జీవో జారీ చేసింది సర్కారు. అయితే గడిచిన నెల రోజులుగా ఆమెకు కీలక పదవి రానుంది అని వార్తలు వినిపించాయి. దీంతో ఇప్పుడు జగన్ సర్కారు జీవో జారీచేయడంతో ఆమె అభిమానులు ఆనందంలో ఉన్నారు. ఇటీవల సీఎం జగన్ ని ఆమె కలిశారు. ఆమెకు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ వస్తుందని చాలా మంది అనుకున్నారు కాని ఆమెకు స్టేట్ లో మంచి కీలకమైన పదవిని ఇచ్చారు సీఎం జగన్.