ఒక్కరికోసం చంద్రబాబు తాపత్రయం

(ఒక్కరికోసం చంద్రబాబు తాపత్రయం

0
219

వైసీపీ అధికారంలో ఉంది ఇప్పుడు నాయకులు పార్టీ మారడం లేదు అని మన చంద్రజ్యోతిలో వార్తలు రాస్తున్నా మనకు పెద్ద మైలేజ్ రావడం లేదు. అందుకే ఈ సమయంలో మన పార్టీలోకి చేరికలు ఉంటే బాగుంటాయి అని చంద్రబాబు ఆలోచన.. అయితే వైసీపీలో విముఖంగా ఉన్న నేతలు ఎవరు వారి లిస్ట్ చూడాలి అని బాబు ఆలోచిస్తున్నారట ..ఒక్క నాయకుడు వచ్చినా జగన్ ని ఆట ఆడుకోవచ్చు అని చూస్తున్నారు బాబు. కాని బాబు ఆశలు మినహ అది కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు.

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా చేశారు.. అలా 23 మంది పార్టీ ఫిరాయించారు. ఇప్పుడు దైవేచ్చలా బాబుకి కూడా 23 సీట్లు వచ్చాయి.. దీంతో వైసీపీ నుంచి ఎవరిని అయినా పార్టీలో చేర్చుకోవాలి అని చూస్తున్నారు. అయితే దీనికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట.

గతంలో నంద్యాల ఉప ఎన్నికల సమయంలో వైసీపీకి తెలుగుదేశం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీ మారారు. మరి ఇలా మైలేజ్ రావాలి అంటే వైసీపీకి కూడా రాజీనామా చేసి ఎవరైనా తెలుగుదేశంలో చేరితే కచ్చితంగా మైలేజ్ వస్తుంది అని బాబు ఆలోచన చేస్తున్నారట.. అయితే తెలుగుదేశం పార్టీ మరో ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేయాల్సిందే, ఈ సమయంలో తెలుగుదేశంలో చేరే సాహసం వైసీపీ నుంచి ఎవరైనా చేస్తారంటారా?