సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా….

సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా....

0
281

సంక్రాంతి అంటేనే సౌత్ ఇండియా పండుగా ఈ పండుగను ఇక్కడి ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు… తమ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ…. జనవరినెల స్టార్ట్ అయిన నాటినుంచి ప్రతీ రోజు మహిళలను తమ ఇంటిముందు పేడతో అలికి ముగ్గులు వేస్తారు…

సంక్రాంతి పండురోజు వేసే ముగ్గులు అనేక అర్ధాలకు సూచిస్తాయని చరిత్ర చెబుతోంది… గ్యాప్ లేకుండా అలిన దాన్ని మేఘాలు లేని ఆకాశం అని ఒక పద్దతిలో పెట్టబడిన చుక్కలు నక్షత్రాలకు సంకేతం అని…. చుక్కల చుట్టు తిరుగుతూ చుక్కలను గళ్లలో ఇమిడ్చే ముగ్గును ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పు సంకేతమని అంటుంటారు పెద్దలు…

అలాగే ముగ్గు మధ్యలో చుక్క సూర్యుడికి సంకేతం అని అంటుంటారు… అలాగే భిన్న ఆలోచనలకు సంకేతం అని అంటున్నారు… ఈ మూడురోజులు ముగ్గులతో ఆనందాన్ని పంచే పండుగ సంక్రాంతి పండుగగా భావిస్తారు…