Shivaratri: శివ రాత్రి హిందువులకి ఎంతో పెద్దపండుగ లాంటిది..శివుడు లింగాకృతి పొందిన రోజు, అందుకే శివరాత్రి రోజున దేశం అంతా శివాలయాల్లో శివపూజలు అందుకుంటాడు శివయ్య…ఇక ఆరోజు చేయకూడని పనులు చూద్దాం..శివరాత్రి రోజు మద్యం మాంసం అసలు మట్టుకోకూడదు.. అలాగే ఎలాంటి పరిస్దితిలో అయినా ఉదయం స్నానం చేయాలి…ఉదయం 8 లోపు కచ్చితంగా శివాలయాన్ని దర్శించాలి. అలాగే చెంబుడు నీళ్లని అయినా స్వామికి అభిషేకించాలి… గేదెపాలు కంటే ఆవుపాలు మాత్రమే అభిషేకం చేయాలి.
Shivaratri: ఇక గర్భగుడికి వెళ్లే సమయంలో పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని అభిషేకం చేయాలి…మహిళలు అభిషేకం చేస్తున్న సమయంలో శివలింగం తాకకూడదు…మన శరీరం నుంచి అభిషేకం చేసే సమయంలో చెమటలు కాని వెంట్రుక కాని శివుడిపై పడకుండా చూడాలి .
శివుడికి దేవాలయానికి మొగలిపువ్వుని తీసుకురాకూడదు ఇది స్వామికి ఇవ్వకండి…పాలప్యాకెట్లని నోటితో కొరికి ఆ పాలతో అభిషేకం చేయకండి…శివరాత్రినాడు భార్య భర్తలు సంభోగం చేయకూడదు. ఇలా చేస్తే పాపాలు మూటగట్టుకుంటారట. ఇక పేదలకు దానం చేయండి, అలాగే తోటకూర దానం చేసినా చాలా మంచిది.