ప్రతిసారి ఎండాకాలం రాగానే ప్రజలు ఏసీల వైపు మొగ్గుచూపుతుంటారు. అయితే ఈ ఏడాదికి కూడా ఎండలు అధికం కావడంతో ప్రజలు ఏసీలు, కూలర్లకు కొందామనే ఆలోచనలో ఉంటుంటారు. కానీ అలాంటి వాళ్ళు నిరాశపడాల్సిందే. ఎందుకంటే త్వరలోనే ఏసీల ధరలు భారీగా పెరుగనున్నాయి.
గత రెండు వేసవి సీజన్లలో కరోనా వైరస్ ఉధృతి కారణంగా అమ్మకాలు ఆశించిన మేర లాభం రాలేదు. దాదాపుగా 5 శాతం వరకు ఏసీల ధరలు పెరగనున్నాయి. దీంతో ఒక్కో ఏసీ ధర రూ. 3-5 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో వినియోగదారుడిపై మరింతగా భారం పడే అవకాశం ఉంది.