మే నెల తొలి వారంలో వరుసగా నాలుగు రోజుల బ్యాంకులు మూతపడనున్నాయి. అంతేకాకుండా మే నెల మొత్తంలో 31 ఉండగా అందులో 13 రోజుల పాటు బ్యాంకులు సెలవులు ఉన్నాయి. అందుకే ఏమైనా అవసరమైన పనులు ఉంటే ఈ జాబితా ప్రకారం చేసుకోండి. అంతేకాకుండా అందరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
2022 మే నెలలో బ్యాంకులకు సెలవులు ఉన్న రోజులివే..
మే 1: కార్మిక దినోత్సవంతో పాటు ఆదివారం కావడం వల్ల కూడా సెలవుగా ఉంటుంది.
మే 2: మహర్షి పరశురామ జయంతి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు)
మే 3: ఈద్-ఉల్-ఫితర్, బసవ జయంతి (కర్ణాటక)
మే 4: ఈద్-ఉల్-ఫితర్, (తెలంగాణ)
మే 8: ఆదివారం
మే 9: గురు రవీంద్రనాథ్ జయంతి – పశ్చిమ బెంగాల్, త్రిపుర
మే 14: రెండవ శనివారం బ్యాంకులకు సెలవు
మే 15: ఆదివారం
మే 16: మెర్క్యురీ పౌర్ణమి
మే 22: ఆదివారం
మే 24: కాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టినరోజు – సిక్కిం
మే 28: 4వ శనివారం బ్యాంకులకు సెలవు
మే 29: ఆదివారం