ప్రయాణికులకు అలెర్ట్..ఈ రూట్ల‌లో రైళ్లు రద్దు..కారణం ఏంటంటే?

0
122

ప్రయాణికులకు బిగ్ అలెర్ట్..పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కారణం ఏంటంటే..దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

రద్దు చేసిన రైళ్ల వివరాలివే..

పూణే-కాజీపేట మధ్య నడిచే వీక్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (22151) రైలు ను సెప్టెంబర్ 23, 30,అక్టోబర్ 9 తేదీల్లో రద్దు చేసారు.

కాజీపేట-పూణే మధ్య నడిచే వీక్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (22152) రైలును సెప్టెంబర్ 25, అక్టోబర్ 2, 11 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు.

సూళ్లూరుపేట-నెల్లూరు మధ్య నడిచే ప్యాసింజర్ (06745) రైలును సెప్టెంబర్ 18 నుంచి 29 వరకు వేదాయపాలెం-నెల్లూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు  తెలిపారు

నెల్లూరు-సూళ్లూరుపేట మధ్య నడిచే ప్యాసింజర్ (06746) రైలును ఈ నెల 18వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నెల్లూరు-వేదాయపాలెం మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

అలాగే సూళ్లూరుపేట-నెల్లూరు-సూళ్లూరుపేట మధ్య నడిచే ప్యాసింజర్ రైలు 06747, 06748ను కూడా వేదాయపాలెం-నెల్లూరు-వేదాయపాలెం మధ్య రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది..

అలాగే  హైదరాబాద్ లో పలు MMTS రైళ్లు కూడా రద్దు అయినట్టు ఈ మేరకు అధికారులు తెలిపారు.