తెలంగాణ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని కాస్త ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో వాతావరణ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఇంకా రానున్న మూడు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
బుధవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ
వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.