ఏపీ ప్రజలకు అలెర్ట్..రాబోయే 3 రోజుల పాటు..

0
112

ఇప్పటికే కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఈ వర్షాల వల్ల కలిగిన నష్టాల నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అందుకే అందరు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలని సూచించింది.

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి, ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ..వచ్చే 12 గంటల్లో బాగా గుర్తించబడి..తర్వాతి 24 గంటల్లో వాయుగుండముగా బలపడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఈ రోజు , రేపు మరియు ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :-ఈ రోజు , రేపు మరియు ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.