భార్యను చూడటానికి… కరోనా ఆసుపత్రి నుంచి పారిపోయిన కొత్త పెళ్లి కోడుకు… నీకోదండం సామీ అంటూ అధికారులు

భార్యను చూడటానికి... కరోనా ఆసుపత్రి నుంచి పారిపోయిన కొత్త పెళ్లి కోడుకు... నీకోదండం సామీ అంటూ అధికారులు

0
92

కరోనా వైరస్ కనికరం లేకుండా ప్రవర్తిస్తుంది… చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది… తాజాగా కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది… దీంతో అతన్ని అధికారులు కరోనా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..

అయితే ఈ క్రమంలో అతను తన భార్య చూడటానికి ఆసుపత్రి నుంచి పారిపోయాడు ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తర్లుపాడుకు చెందిన ఒక వ్యక్తికి ఇటీవలే వివాహం అయింది… కొద్దిరోజుల తర్వాత అతనికి కరోనా సోకడంతో ఆసుపత్రికి తరలించారు.. ఈక్రమంలో అతను ఆసుపత్రినుంచి బయటకు వచ్చాడు..

ఎంతసేపు అయినా లోపలికి రాకపోవడంతో అధికారలు పోలీసులకు సమాచారం అందించారు.. అతడు భార్యను చూడటానికి ఇంటికి వెళ్లాడని తెలిసింది.. దీంతో అధికారులు అతన్ని ఏమీ అనలేక నీకోదండం సామీ అంటూ ఆసుపత్రికి తరలించారు..