దిషపై అత్యాచారం నిందితులను కోర్టులో షాక్

దిషపై అత్యాచారం నిందితులను కోర్టులో షాక్

0
37

దుర్మారుగు నీచులు ఈనలుగురు దిషపై ఎంతో దారుణంగా అమానుషంగా ప్రవర్తించి రేప్ చేసి చంపేశారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి వారికి వెంటనే ఉరి శిక్ష అమలు చేయాలి అని అందరూ కోరుతున్నారు.. వారి కుటుంబానికి సరైన న్యాయం జరిగాలి అంటే అదే సరైన శిక్ష అని కూడా చెబుతున్నారు.. సినీ రాజకీయ పారిశ్రామిక సెలబ్రెటీలు అందరూ ఇదే కోరుతున్నారు. తమ కుమార్తెకు ఇంత దారుణమైన పరిస్దితి వస్తే ఏ కుటుంబం కూడా ఉండలేదు అని అంటున్నారు.

ఇప్పటికే ఈ కేసును త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో వీలైనంత త్వరలో నిందితులపై చార్జ్షీట్ రూపొందించాలని పోలీసులు భావిస్తున్నారు. భారత లా ప్రకారం పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారు తప్పించుకోవడానికి వీల్లేకుండా సాక్ష్యాలను సేకరిస్తున్నారు.అయితే వారు తప్పించుకునే ఆస్కారం లేదు పైగా వారి తరపున లాయర్లు కూడా వాదించే అవకాశం ఉండదు.

ఫోరెన్సిక్ నివేదిక అందిన వెంటనే చార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. వరంగల్లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన హత్యాచార కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. నిందితుడు ప్రవీణ్కు 56 రోజుల్లోనే మరణశిక్ష విధించింది.తాజాగా వీరికి కూడా మరో 20 రోజుల్లో మరణశిక్ష పడే అవకాశం ఉంది అని చెబుతున్నారు పోలీసులు.