దిషా హత్యకేసులో నిందితులకు కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది

దిషా హత్యకేసులో నిందితులకు కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది

0
104

తెలంగాణా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాద్నగర్లో వెటర్నరీ డాక్టర్ దిష హత్య సంఘటన కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు జైలులో ఉంచారు.. ఇప్పటికే 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో పూర్తి వివరాలు బయటకు తేవాలని భావిస్తున్న పోలీసులు. ఈ సంఘటనకు ముందు జరిగింది అలాగే సంఘటనలో ప్రతీ అంశం కూడా అన్ని అంశాలనూ వివరంగా తెలుసుకొని పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు తమ అభిప్రాయం చెబుతున్నారు. పోలీసులు ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అంతే కాకుండా దేశవ్యాప్తంగా నిందితులకు ఉరిశిక్షే వెయ్యాలనే డిమాండ్ ఉండటంతో… జడ్జి కూడా ఆ దిశగానే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక వీరికి సుమారు 20 రోజుల్లో కేసు తీర్పు రానుంది అని తెలుస్తోంది, నలుగురు నిందితులకి ఉరిశిక్ష వేసే అవకాశం ఉంది అంటున్నారు న్యాయవాదులు..అయితే ఇప్పటికే పోలీసులు చాలా సాక్షాధారాలు సేకరించారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇవన్నీ మరో 12 రోజుల్లో పూర్తి అవుతాయట. రిమాండ్ తర్వాత వీరికి శిక్షపై క్లారిటీ రానుంది అని చెబుతున్నారు లాయర్లు.