పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి..గడువు ఎప్పటివరకంటే?

0
115
PM KISAN

చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. ప్రతి 4 నెలలకు రూ.2000 రైతు ఖాతాకు బదిలీ చేస్తున్నారు.

అయితే ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి చాలామంది బోగస్‌ రైతులు ఈ పథకం ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. ఈ అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమాలను మార్పు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ప్రధానమంత్రి రైతు సన్మాన పథకం ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులను తప్పనిసరి చేసింది.

కొందరు రైతులు ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో ఈ పథకం లబ్ది పొందలేకపోతున్నారు. ఈ-కేవైసీ చేసేందుకు జులై 31 వరకు గడువు ఉంది.

E-KYC ఎలా చెయ్యాలంటే..

pmkisan.gov.in వెబ్ సైట్ కి వెళ్లి E-KYC ఆప్షన్ క్లిక్ చేయాలి.
రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కు వచ్చే ఓటీపీని నమోదు చేసి..
సబ్మిట్ నొక్కితే సరిపోతుంది.