ఫించన్ డబ్బులు తీసుకోని ప్రియురాలి తో జంప్

0
120

సీఎం వైఎస్ జగన్ పింఛనుదారులు ఏ ఇబ్బంది పడకూడదనే ఉదేశ్యంతో ఇంటికే నేరుగా సంక్షేమ పథకాలు అందించాలన్న ఆలోచనతో ఈ వాలంటీర్ వ్యవస్థను రూపొందించారు. ఇందుకు తగ్గట్టే వాలంటీర్లు కూడా తక్కువ డబ్బులతోనే ప్రజలకు చక్కగా సేవలందిస్తున్నారు. కానీ కొందరు వాలంటీర్లు మాత్రం తప్పు దారిలో వెళ్ళి ఈ వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తున్నారు. తాజాగా ఏపీలో ఓ గ్రామ వాలంటీర్ చేసిన నిర్వాకం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మూగచింతపాలెంలో రవి అనే వాలంటీర్ పింఛను డబ్బులను తీసుకుని, ప్రియురాలితో కలిసి పరారయ్యాడు. ఈ విషయాన్ని గ్రామ సచివాలయ సిబ్బంది సదరు వాలంటీర్ తండ్రి దృష్టికి తీసుకురావడంతో..పింఛనుదారులు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో వాలంటీర్ తండ్రి తన కుమారుడు తీసుకెళ్లిన మొత్తాన్ని సచివాలయ సిబ్బందికి అందించారు.

అనంతరం వారు లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేశారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, గ్రామ వాలంటీర్ కు పెళ్లయి, పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఆయన ఇలా చేయడంతో, అమ్మాయి తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ రవిపై గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా మునుపెన్నడూ పింఛన్ డబ్బులు సరిగా పంపిణీ చేయలేదని స్థానికులు చెపుతున్నారు.