ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..ఇక సచివాలయాల్లోనే ఆధార్ సేవలు

0
93

ఏపీ నగరవాసులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల ఆధార్ కు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ చేయించుకోవాలన్నా మీ సేవ, పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండగా..తాజాగా ఈ అంశంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టి ఏపీ నగర వాసులకు ఆ బాధ లేకుండా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు ఆధార్ సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 1,100 కేంద్రాల్లో ఆధార్‌ సేవలు ప్రారంభమయినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా మొదటి సారి ఆధార్‌ నమోదు చేసుకునే ఇది చక్కని అవకాశంగా చెప్పుకోవచ్చు.

ఎందుకంటే మొదటి సారి ఆధార్‌ నమోదు చేసుకునే వారికి పూర్తి ఉచితంగా సేవలు అందజేస్తారని గ్రామ వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. కానీ ఆధార్‌ కలర్‌ ప్రింట్, బయోమెట్రిక్‌లో తప్పులు సరిదిద్దడం, అడ్రసు తదితర వివరాల్లో మార్పులకు ఆధార్‌ నమోదు సంస్థ నిర్ధారించిన సర్వీసు చార్జి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. విధివిధానాలపై జిల్లా కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఆదేశాలు మేరకు ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకునే వారికి కూడా ఒకసారి ఉచిత సేవలు అందిస్తారని వెల్లడించింది.