తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆర్జిత సేవలపై టీటీడీ కీలక నిర్ణయం

0
101

తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆర్జీత సేవలను రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. ఇక ఇప్పుడు కరోనా తగ్గడంతో ఈ సేవలకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిడ్‌ ముందున్న విధానంలోనే ఆర్జితసేవా టికెట్ల బుకింగ్‌ ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తిరుమలకు రావాలని టీటీడీ పేర్కొంది. ఈ సేవలు ఏప్రిల్ 1వ తేది నుంచి జరుగుతాయని టీటీడీ తెలిపింది.

కరోనా మహమ్మారి విజృంభణతో 2020 మార్చి 20 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి నిలిపివేశారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 80 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులను అనుమతినే రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత భక్తులను అనుమతించారు.. భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించార. సెకండ్ వేవ్ వ్యాప్తితో భక్తుల ఆరోగ్యం భధ్రత దృష్ట్యా కోవిడ్ నిబంధనలను కొండపై మరింత కఠినతరం చేశారు.. పరిమిత సంఖ్యలో భక్తుల్ని అనుమతించారు.

వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదని టీటీడీ స్పష్టం చేసింది.. వర్చువల్ ఆర్జిత సేవల బుక్ చేసుకున్న భక్తుల ద‌ర్శ‌నం క‌ల్పించ‌డంతో పాటు ప్ర‌సాదాలు మాత్రమే అందించనుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని.. ఉద‌యాస్త‌మాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1 నుంచి కొవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమ‌తించనున్నారు. కాగా.. నిన్న శ్రీవారిని 61982 మంది భక్తులు దర్శించుకోగా..27400 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.