అభిమానమంటే ఇష్టమైన హీరో సినిమా చూసి, ఆరాధించడమే కాదు. వారు చూపిన మంచి మార్గం వైపు కూడా అడుగులు వేయడమని నిరూపించారు ఓ ఆటో డ్రైవర్. విలువైన వస్తువులు లేదా నగదు దొరికితే..దాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి ఇవ్వాలనే మంచితనం, వ్యక్తిత్వం లేని సమాజంలో నేడు మనం ఉన్నాం అనడంలో ఆశ్చర్యం లేదు. అదును దొరికితే మోసగించాలని ప్రయత్నించే వాళ్లు ఎందరో. ఇటువంటి పరిస్థితుల్లో ఓ ఆటో డ్రైవర్ ప్రయాణికుడు తన ఆటోలో మర్చిపోయిన రూ.2 లక్షల నగదును పోలీసులకు అప్పగించాడు.
కుమార్తె వివాహం కోసం బ్యాంక్ లో డ్రా చేసిన 1.5 లక్ష నగదును ఓ ప్రయాణికుడు ఆటోలో మరిచిపోయాడు. కష్టం విలువ తెలిసిన ఆటోడ్రైవర్ హుస్సేన్ నగదు బ్యాగును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించాడు. ప్రయాణికుని వివరాలు తెలుసుకొని నగదు అందజేస్తామని పోలీసులు తెలిపారు.