ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 113 మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
జనరల్, డిపో, మూవ్‌మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్, హిందీ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
జోన్‌ల వారీగా ఖాళీల విషయానికొస్తే.. నార్త్ జోన్ (38), సౌత్ జోన్ (16), వెస్ట్ జోన్ (20), ఈస్ట్ జోన్ (21), నార్త్-ఈస్ట్ జోన్ (18) ఖాళీలు ఉన్నాయి.
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్, బీకాం, బీఎస్సీ, బీటెక్, బీఈ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఐసీఏఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను తొలుత ఫేజ్ – 1, ఫేజ్ – 2 ఆన్‌లైన్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఫేజ్ 1 పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 27-08-2022న మొదలై 26-09-2022తో ముగియనుంది.
ఆన్‌లైన్ పరీక్షను 2022 డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు.