జర్మలిస్టులకు మోడీ సర్కార్‌ గుడ్ న్యూస్..అక్రిడిటేషన్‌ కార్డులపై కీలక నిర్ణయం

Modi government's good news for Germans. Accreditations for them too

0
91

జర్మలిస్టులకు మోడీ సర్కార్‌ శుభవార్త చెప్పింది. తాజాగా అక్రిడిటేషన్‌ జారీ చేయడం పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. వెబ్‌ సైట్‌ జర్నలిస్టులకు లబ్ది చేకూరనుంది. ప్రస్తుతం కాలంలో ప్రింట్‌ మీడియా కంటే.. డిజిటల్‌, వెబ్‌ సైట్‌ జర్నలిజం విపరీతంగా పెరిగి పోయింది.

ఈ నేపథ్యంలోనే వాటిని పరిగణలోకి తీసుకుని.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్‌ సైట్‌ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్‌ ఇవ్వాలని పేర్కొంది. అయితే.. వెబ్ సైట్ లో కనీసం ఒక సంవత్సరం పాటు నిరంతరాయంగా పనిచేసే ఉండాలని సూచించింది.

వెబ్ సైట్ కి దేశంలో రిజిస్టర్ కార్యాలయం ఉండాలని పేర్కొంది. విదేశీ వార్త మీడియా సంస్థల కోసం పనిచేస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు ఇలాంటి అక్రిడిటేషన్ మంజూరు చేయకూడదని పేర్కొంది. అలాగే దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా, కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడిన వారి అక్రిడిటేషన్ రద్దు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.