టీఎస్ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ తుది విడత షెడ్యూల్‌ విడుదల

Release of TS Amset Engineering Final Installment Schedule

0
93

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ తుది విడత షెడ్యూల్‌ విడుదలైంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్‌ బుకింగ్​ చేసుకోవచ్చు. ఈనెల 27న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 27 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాలి. నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది.

నవంబర్‌ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌..నవంబర్‌ 9, 10న వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. నవంబర్‌ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. నవంబర్‌ 14న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.