తెలంగాణ సీఎం కేసీఆర్‌కు షాక్!..సంచలన విషయాలు వెలుగులోకి..

0
47

తెలంగాణలో చాలా గ్రామాల్లో మౌలిక వసతులు లేవని కేంద్రం తేల్చి చెప్పింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ తాజా అధ్యయనంలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాల్లో గిరిజన గ్రామాల్లోని మౌలిక వసతులపై విశ్లేషించి కేంద్రం ర్యాంకులు ఇచ్చింది. 1,663 గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం నివేదిక ఇచ్చింది.

గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి 21-40 శాతం మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తమ సదుపాయాల కల్పనలో మహబూబ్‌నగర్. వసతులు కల్పించని జిల్లాగా ఆదిలాబాద్‌లకు ర్యాంకులు ఇచ్చారు. దీనితో గిరిజన గ్రామాల అభివృద్ధికి ఎంతో చేశామని చెప్పుకున్న సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చినట్లు అయింది.