ఆర్టీసీ మరో షాక్..పెరగనున్న ఛార్జీలు

0
41

ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇటీవలే డీజిల్, పెట్రోల్, నూనె, గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా..తాజాగా టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే దాదాపు 35 శాతం వరకు బస్సు ఛార్జీలు పెరగగా..అయినప్పటికీ నష్టం వస్తుందని టీఎస్ ఆర్టీసీ అధికారులు టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. సగటున 20 నుంచి 30 శాతం వరకు పెంచాలనే యోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది.

త్వరలోనే దీనికి ఆమోదం వస్తుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే డీజిల్ సెస్ రూపంలో ధరలు రెండుసార్లు పెంచి వసూళ్లు చేస్తున్నా..ఇంకా రూ.2.40 కోట్ల వరకు నష్టం వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.