శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది. రెండు నెలల పాటు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
కఠినమైన కరోనా నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. ఇందుకు సంబధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
రెండు డోసులు తీసుకున్న వారు కొవిడ్ సర్టిఫికేట్ చూపించాలి. లేకపోతే శబరిమలను సందర్శించుకునే 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాలి, ఆ నెగిటివ్ రిపోర్టును అధికారులకు సమర్పించాలి.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు హెల్త్ చెకప్ చేయించుకుని ఆలయానికి రావాలి.
ఒరిజినల్ ఆధార్ తప్పనిసరిగా చూపించాలి.
వాహనాలకు నీలక్కల్ వరకే అనుమతి ఉంటుంది. అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.
కాలి నడకన వచ్చే భక్తులు..స్వామి అయ్యప్పన్ రోడ్డును మాత్రమే ఉపయోగించుకోవాలి.