ఏపీలో ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక సూచిస్తున్న వాతావరణ శాఖ..

0
95

ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వాతావరణశాఖ సూచిస్తుంది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రైతులు ముందే పంటల విషయంలో అన్ని జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ చెబుతుంది. కేవలం వర్షాలే కాకుండా పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉండడంతో బయట ప్రాంతాల్లో అధికంగా తిరుగొద్దని చెబుతున్నారు.

దీనివల్ల పిడుగుపాటుతో మృతిచెందే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు,అన్నమయ్య, కర్నూలు జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ చేశారు డైరెక్టర్, విపత్తుల సంస్థ డా.బిఆర్ అంబేద్కర్. తిరుపతి జిల్లాలోని తిరుపతి అర్బన్, రేణిగుంట,నారాయణవనం, కెవిబి పురం, నాగులాపురం, పిచ్చాటూరు, పుత్తూరు ప్రాంతాల్లో పిడుగులు పడుతాయని హెచ్చరించారు.

అలాగే.. చిత్తూరు జిల్లాలోని.. నగరి, నిండ్ర, విజయపురం, అన్నమయ్య జిల్లాలోని.. కురబలకోట, మదనపల్లె, బి.కొత్తకోట, గుర్రంకొండ, కలికిరి,వాయల్పాడులోనూ పిడుగులు పడతాయని వార్నింగ్‌ ఇచ్చారు. కర్నూలు జిల్లాలోని చిప్పగిరి, మద్దికెర ఈస్ట్, ఆదోని, ఆస్పరి, పెద్దకడుబూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు మండలాలు మరియు పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.