పెళ్లికొడుకుకు ఊహించని షాక్ ఇచ్చిన నవ వధువు..

0
107

ఉత్తరప్రదేశ్ లో ఎవరు ఊహించని విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు కలిసి బ్రతకాలనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకునే ఈ రోజుల్లో కానీ ఓ యువతీ మాత్రం పెళ్ళికొడుకును మోసం చేసి తప్పించుకుంది. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని అలీగడ్ లో చోటు చేసుకుంది.

ఖుషీ రామ్ అనే వ్యక్తికి వయస్సు మీద పడుతున్న వివాహం జరగకపోవడంతో గోవింద్ పూర్ కు చెందిన బంటి అనే వ్యక్తిని సంప్రదించడగా మంచి అమ్మాయిని వెతికి పెడతానని మాట ఇచ్చాడు. చెప్పిన విధంగానే ఏప్రిల్ 24న ఆగ్రాలో పెళ్లి చూపులు జరిగిన అనంతరం ఆరోజు రాత్రే పెళ్లి చేద్దామని నిశ్యయించుకొని పెళ్లి జరిపించారు.

పెళ్లి సమయంలో వధువు పెళ్ళికొడుకు కుటుంబం దగ్గర నుంచి రూ.లక్షన్నర నగదు, చీరలు, ఆభరణాలు తీసుకుంది. పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం నవ దంపతులు కోర్టుకు వెళ్లిన తర్వాత బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి రాకపోవడంతో తాము మోసపోయినట్టు పెళ్లికొడుకుకు కుటుంబం గుర్తించింది. దాంతో వరుడు కుటుంబం పోలీసులను సంప్రదించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.