పోలీసు శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసే పోస్టులు ఇవే..

0
108

తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30,453 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అనుమ‌తి ఇచ్చింది. ఈ మేరకు శాఖల వారిగా పోస్టులను వెల్లడించింది. పోలీసు నియామక బోర్డు ద్వారా 16,804 పోస్టులు భర్తీ చేయనున్నారు.

పోలీసు నియామక బోర్డు ద్వారా 4 వేల 965 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 4 వేల 423 ఏఆర్ కానిస్టేబుల్‌ పోస్టులు, 5 వేల 704 టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులు, 262 ఐటీ అండ్ సీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నాయి. సివిల్‌ ఎస్సై పోస్టులు 415, ఏఆర్ ఎస్సై పోస్టులు 69, టీఎస్ఎస్పీ SI పోస్టులు 23, ఐటీ అండ్ సీ ఎస్సై పోస్టులు 23, సీపీఎల్‌లో ఐదు ఎస్సై పోస్టులు ఉన్నాయి.

అలాగే జైళ్ల విభాగంలో 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, పోలీసు విభాగంలో 227 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. రవాణాశాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 36 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు.