వాహనంలో పైన పుచ్చకాయలు లోపల ఏముందో చూసి షాకైన పోలీసులు

వాహనంలో పైన పుచ్చకాయలు లోపల ఏముందో చూసి షాకైన పోలీసులు

0
102

దేశంలో మధ్యం షాపులు తెరచుకోవడంతో ఈ లాక్ డౌన్ వేళ మందుబాబులు పెద్ద ఎత్తున మద్యం కోసం బారులు తీరుతున్నారు… ఇక మద్యం రేటు కూడా భారీగా పెంచినా క్యూ మాత్రం అలాగే ఉంటోంది. ఇక తాజాగా మద్యం స్మగ్లింగ్ చేస్తూ కొందరు కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోయారు.

తెలంగాణ నుండి ఆంధ్రాకి వయా పొందుగల మినీ వ్యానులో పైన పుచ్చకాయలు కింద 5 లక్షలు విలువ కలిగిన అక్రమ మద్యం పెట్టి తరలిస్తుండగా పోలీసుల చేతికి చిక్కారు, వీరిని అరెస్ట్ చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు, ముఖ్యంగా వీరి ముఠాగా ఏడుగురు ఉన్నారని పోలీసులు గుర్తించారు.

స్పాట్ లో నలుగురిని అరెస్ట్ చేశారు.. వారి మీద సెక్షన్ 188,34(A) AP GAMING ACT కింద అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కి తరలించారు, ఇలా పుచ్చకాయలు, పళ్లు పాలు కూరగాయలు అంటూ అనేక మార్గాల్లో మద్యం అక్రమ సరఫరా చాలా చోట్ల జరుగుతున్నాయి, అందుకే పోలీసులు ప్రతీ వాహనం చెక్ చేసి పంపుతున్నారు, ఇలాంటి కేడీలు దొరుకుతున్నారు.