వెస్టిండీస్‌తో త్వరలో జరిగే టీ-20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 5 మ్యాచ్‌ల టీ20ల సిరీస్ నుంచి వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), కింగ్ కోహ్లీల(Virat Kohli)కు తప్పించారు. ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను కెప్టెన్‌గా నియమించగా, సూర్యకుమార్ యాదవ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. ఐపీఎల్‌లో సత్తాచాటిన గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజూశాంసన్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్‌లు పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే, కోల్‌కతా సంచలనం రింకూసింగ్‌కు మాత్రం టీ20 జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) ఎంపికైన మరుసటి రోజే భారత జట్టును ఎంపిక చేశారు. 2024 టీ-20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి పూర్తిగా యువ ఆటగాళ్లకే ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. అందుకే రోహిత్, విరాట్, మహ్మాద్ షమీ వంటి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేశారు.
Read Also:
1. ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉంటే.. స్త్రీలకు ఆ సమస్యలు!
2. ఇవి తింటే ఉన్న వయసుకంటే 10 ఏళ్లు యంగ్ గా కనిపిస్తారు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat