భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir)పై టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంభీర్ తలొగ్గే వ్యక్తి కాదంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీ అవుతున్న క్రమంలో గంభీర్(కోచ్‌గా)తో కలిసి పనిచేయడం గురించి రోహిత్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘గతంలో రాహుల్ భాయ్‌తో కలిసి పనిచేశారు. ఇప్పుడు గంబీర్‌తో కలిసి పనిచేస్తున్నాను. గంభీర్ అంత త్వరగా తల వంచే వ్యక్తి కాదు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా చివరి క్షణం వరకు పోరాడాలని బలంగా నమ్మే వ్యక్తి. దేశం కోసం ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లలో కీలకంగా నిలిచారు. అటువంటి వ్యక్తి కోచింగ్‌లో పనిచేయడం సరికొత్త అనుభవాన్ని అందిస్తోంది. నేనాడుతూ జట్టును ముందుకు నడిపించడమే కెప్టెన్‌గా నా బాధ్యత. ప్రస్తుతం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చాలా బాగుంది. ఒకరికొకరం స్ఫూర్తిని ఇచ్చుకోవడంపై దృష్టి సారించాం. టీ20లకు గుడ్‌బై చెప్పడానికి అదే సరైన సమయం అని భావించే అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను’’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
అయితే రోహిత్ శర్మ(Rohit Sharma) గతంలో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఉన్నప్పుడు అతనితో కలిసి పనిచేశాడు. ఇటీవల ఆ పదవిలోకి గంభీర్ వచ్చాడు. ఇప్పుడు అతనితో కలిసి పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి టీమెట్స్‌గా కూడా ఆడి ఉన్నారు. అయితే టీమిండియా హెడ్‌కోచ్ గంభీర్.. తొలి పర్యటనలో మిత్రమ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో పోరాడటానికి టీమిండియా రెడీ అవుతోంది. కోచ్ వరకు చూసుకుంటే గంభీర్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. ప్రతి ఆటగాడిలో టాలెంట్‌ను గుర్తించడంలో గంభీర్ ది బెస్ట్ అనిపించుకుంటున్నట్లు తెలుస్తోంది.