ప్రపంచ చెస్ సమరం.. సిందరోవ్‌కే ఛాన్స్ అంటున్న అంచనాలు!

-

Alltimereport, Desk: భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ డి గుకేష్ (Gukesh) ప్రపంచ చెస్ టైటిల్ వేటలో మరో చారిత్రాత్మక సమరానికి సిద్ధమవుతున్నారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నవంబర్ 24 నుండి డిసెంబర్ 12 వరకు జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జావోఖిర్ సిందరోవ్‌(Sindarov)తో గుకేష్ తలపడనున్నారు. డిసెంబర్ 2024లో డింగ్ లిరెన్‌ను ఓడించి 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గుకేష్.. ఈసారి తన టైటిల్‌ను కాపాడుకోవడానికి సిద్ధమవుతున్నారు. అందుకోసం ఇటీవల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ హై-వోల్టేజ్ పోరుపై రష్యన్ గ్రాండ్‌మాస్టర్ పీటర్ స్విడ్లర్ ఆసక్తికరంగా మాట్లాడారు.

- Advertisement -

ప్రస్తుత ఫామ్ ప్రకారం గుకేష్ కంటే సిందరోవ్‌కే 55-45 శాతం ఆధిక్యం ఉందని ఆయన అంచనా వేశారు. అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్ లాంటి ప్రత్యేక ఫార్మాట్‌లో గుకేష్‌కున్న (Gukesh) అనుభవం, ఒత్తిడిని తట్టుకునే ప్రతిభను తక్కువగా అంచనా వేయలేమని స్పష్టం చేశారు. ఇద్దరు ఆటగాళ్లకు 20 ఏళ్లు ఉన్నప్పుడే ఈ మ్యాచ్ జరగనుండటంతో ప్రపంచ చెస్ చరిత్రలోనే ఇది అత్యంత పిన్న వయస్కుల టైటిల్ పోరుగా నిలవనుంది. నవంబర్ 22న ప్రారంభ వేడుకలు జరగనుండగా, 14 క్లాసికల్ గేమ్‌ల సిరీస్‌లో మొదట 7.5 పాయింట్లు సాధించిన వారు విజేతగా నిలుస్తారు.

Also Read : అదరగొట్టిన ఆర్యవీర్.. సెమీస్‌కు భారత్

Follow Us on: X (Twitter)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఏపీలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌.. 720 పోస్టులు!

Alltime Report, Desk : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు స్వీట్...

అదరగొట్టిన ఆర్యవీర్.. సెమీస్‌కు భారత్

Alltime Report, Desk: అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈకి భారత్ చుక్కలు...