నేనున్నానుగా.. పతిరణ కుటుంబసభ్యులకు ధోనీ భరోసా

-

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లోకి దూసుకెళ్లడంలో శ్రీలంక యువ పేసర్ మతీష్ పతిరణ(Matheesha Pathirana) కీలకపాత్ర పోషించాడు. ఆ దేశ సీనియర్ ఆటగాడు మలింగాను తలపించే బౌలింగ్ యాక్షన్ తో యార్కర్లు విసురుతూ విజయాలు అందించాడు. కీలక సమయాల్లో కెప్టెన్ ధోనీకి నమ్మకమైన బౌలర్ గా మారాడు. ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ లో ఉన్న ధోనీ(MS Dhoni)ని పతిరణ కుటుంబసభ్యులు కలిశారు. అయితే చిన్నవాడైన పతిరణ కుటుంబానికి దూరంగా ఇన్ని రోజులు ఐపీఎల్ కోసం ఇండియాలో ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై MS Dhoni స్పందిస్తూ అతడెప్పుడూ తనతోనే ఉంటాడు.. తాను చూసుకుంటా అని వారికి భరోసా ఇచ్చాడు. దీంతో తన సోదరుడు గురించి మాకు భయం అక్కర్లేదు.. అతడిని ధోనీ భద్రంగా చూసుకుంటున్నాడంటూ పతిరణ సోదరి విషూక సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

- Advertisement -
Read Also:
1. ‘MS ధోనీ కన్నీరు పెట్టుకున్నప్పుడు నేను పక్కనే ఉన్నా’
2. రాత్రి భోజనం తర్వాత అరటిపండు తింటే జరిగే అనర్ధాలివే..

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...