IPL Final |మంగళవారం రాత్రి జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించి ఫైనల్(IPL Final) కు చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులో స్లో ఓవర్ రేట్(Slow Over Rate) కారణంగా చెన్నై జట్టుకు షాక్ తగలనుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ కొత్త రూల్స్ ప్రకారం వరుస మ్యాచుల్లో స్లో ఓవర్ రేట్ నమోదైతే మొదటి రెండు మ్యాచుల్లో జరిమానా విధిస్తారు. తర్వాతి మ్యాచులో కూడా అలాగే కొనసాగితే ఆ జట్టు కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం ఉంటుంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో జరిమానా ఎదుర్కొన్న ధోనీ(MS Dhoni).. క్వాలిఫైయర్ మ్యాచ్ లోనూ అదే తప్పిదం చేయడంతో రూల్స్ ప్రకారం ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాలి. అయితే జరిమానానా? లేక నిషేధమా? అనేది ఐపీఎల్(IPL) అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
Read Also:
1. వేసవిలో ఈ ఫుడ్స్ రోజువారీ డైట్ లో చేరిస్తే మంచి బెనిఫిట్స్
2. హ్యాపీ లైఫ్ కోసం ఈ సిక్స్ రూల్స్ పాటించండి
Follow us on: Google News, Koo, Twitter