ధోనీ, కోహ్లీ, రోహిత్.. ముగ్గురు కెప్టెన్సీల్లో టీమిండియాకు ఆడిన ఆటగాళ్లలో స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్(Ashwin) ఒకడు. తాజాగా ఈ ముగ్గురు కెప్టెన్సీ విధానంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముగ్గురులోకి రోహిత్ కెప్టెన్సీలో జట్టు వాతావరణం తేలికగా ఉంటుందని, అలా ఉంచడానికి రోహిత్ చాలా కష్టపడతాడని చెప్పుకొచ్చాడు ఈ సీనియర్ స్పిన్నర్. ఈ ఒక్కవిషయంలోనే కాదని కొన్ని ఇతర విషయాల్లో కూడా ధోనీ, కోహ్లీ కన్నా రోహిత్ శర్మే బెటర్ అని అన్నాడు. తాజాగా ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ మధ్య వ్యత్యాసం గురించి అశ్విన్ చాలా తేలికగా వివరించరు. ముగ్గురు సారథ్యం ఒకేలా ఉన్నా స్వల్ప తేడాలు ఉన్నాయని చెప్పాడు.
‘‘రోహిత్(Rohit Sharma) కెప్టెన్సీలో కొన్ని విషయాలు నాకు చాలా బాగా నచ్చుతాయి. ఎలాంటి స్థితిలో అయినా జట్టు వాతావరణాన్ని తేలికగా ఉంచుతాడు. జట్టు ఎంపికలో కూడా పక్కా ప్లాన్‌తో వెళ్లి వ్యూహాత్మకంగా బలంగా ఉంటాడు. వ్యూహాలు రచించడంలో ధోనీ, కోహ్లీ కూడా దిట్టలే అయినా.. రోహిత్ వారికన్నా కాస్త బెటర్. వ్యూహాలు రచించడానికి కూడా రోహిత్ చాలా కసరత్తు చేస్తాడు. ఏదైనా సిరీస్, మ్యాచ్ వస్తుందంటే చాలు కోచ్, ఎనలటిక్స్ టీమ్స్‌తో కూర్చుని ముందు నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తుంటాడు. నా కెరీర్‌లో ఎక్కువ భాగం వీరు ముగ్గురుతో ఆడాను. వీరిలో రోహిత్ చాలా బెటర్ అని నా అభిప్రాయం’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 5 నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీకి కోహ్లీ(Virat Kohli), ధోనీ(Dhoni) ఇద్దరూ దూరంగా ఉండనున్నారు. పనిభారం పెరుగుతుండటంతో ఈ ట్రోఫీకి దూరంగా ఉండాలని వీరిద్దరూ ఫిక్స్ అయ్యారు. అందుకు బీసీసీఐ కూడా ఓకే చెప్పింది. ఆ తర్వాత సెప్టెంబర్ 19 నుంచి మొదలయ్యే బంగ్లాదేశ్.. ఇండియా టూర్ టెస్ట్ సిరీస్‌ల నుంచి వీరిద్దరూ మళ్ళీ గ్రౌండ్‌లోకి అడుగుపెడతారు. ఈ సిరీస్‌కు అశ్విన్(Ashwin) కూడా ఎంపిక జరగే అవకాశం ఉంది.