భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అద్భుత ఆరంభాలతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు రోహిత్ అదిరిపోయే ప్రారంభం ఇచ్చాడు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ 29 బంతుల్లోనే 4 సిక్సర్లు, 4 ఫోర్లతో 47 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.
Rohit Sharma |వన్డే వరల్డ్ కప్ టోర్నీలలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 51 సిక్సర్లతో తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (49), ఏబీ డీవిలియర్స్ (37), రిక్కీ పాంటింగ్ (31), బ్రెండన్ మెక్ కల్లమ్ (29) ఉన్నారు. అంతేకాకుండా వన్డేల్లో డివిలియర్స్ (58) రికార్డును బ్రేక్ చేసి ఒకే ఏడాదిలో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గానూ నిలిచాడు.