Rohit Sharma అభిమానులకు గుడ్ న్యూస్

-

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి తండ్రి అయ్యారు. శుక్రవారం ఆయన భార్య రితిక సజ్దే(Ritika Sajdeh) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ దంపతులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానులు జూనియర్ రోహిత్ అంటూ పోస్టులు పెట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రోహిత్ – రితిక దంపతులకు ఇప్పటికే సమైరా అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) సోదరి రితికను రోహిత్ శర్మ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో 2015 డిసెంబర్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి 2018 డిసెంబర్ 30 న సమైరా అనే ఆడబిడ్డ జన్మించగా… తాజాగా మరో మగబిడ్డకు రితిక జన్మనిచ్చింది. మరోవైపు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే టీమ్ ఇండియా జట్టు ఆస్ట్రేలియా చేరుకుంది. కానీ రోహిత్(Rohit Sharma) మాత్రం భార్య డెలివరీ కోసం ఇక్కడే ఉండిపోయాడు.

Read Also:  యూపీలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారులు సజీవ దహనం
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...