ఐర్లాండ్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం సౌతాఫ్రికా(South Africa )కు కలిసొచ్చింది. ఏకంగా వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో దక్షిణాఫ్రికా 8వ స్థానాన్ని దక్కించుకుంది. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌తో ఐర్లాండ్ మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. అయితే ఈ సిరీస్‌ను 3-0తో ఐర్లాండ్ క్లీన్ స్వీప్ చేస్తే.. ఆ జట్టు వన్డే వరల్డ్‌కప్‌లో 8వ స్థానంలో నిలిచేది. కానీ తొలి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఐర్లాండ్‌కు ఈ అవకాశం లేకుండా పోయింది. దీంతో వరల్డ్ కప్‌లో తలపడే జట్లు ఫైనల్ జాబితాలో సౌతాఫ్రికాకు స్థానం దక్కింది. దీంతో ఐర్లాండ్(Ireland) ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఆడటం కుదరదు. కాగా, గతేడాది నుంచి సౌతాఫ్రికా సూపర్ ఫామ్‌లో ఉంది.
ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. ఆ తర్వాత నెదర్లాండ్‌పై వన్డే సిరీస్ ను 2-0తో గెలిచింది. అనంతరం వెస్టిండీస్‌తో జరిగిన రెండు వన్డేల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఈ ఫలితాలతో వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో సౌతాఫ్రికా(South Africa) 8వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఐర్లాండ్.. బంగ్లాదేశ్ పై 3–0తో సిరీస్ ను దక్కించుకుంటే మాత్రం సౌతాఫ్రికా వన్డే వరల్డ్ కప్ జాబితాలో 8వ స్థానాన్ని మిస్ చేసుకునేది. అలాగే న్యూజిల్యాండ్ చేతిలో శ్రీలంక 2-0 తేడాతో ఓడిపోవడం కూడా ప్రోటీస్ టీమ్‌కు కలిసొచ్చింది. మరోవైపు వన్డే వరల్డ్ కప్-2023కు ఆతిథ్యం ఇస్తుండటంతో టీమిండియా నేరుగా అర్హత సాధించింది.
Read Also: ఆప్ ఎంపీ తో పరిణీతి చోప్రా ఎంగేజ్మెంట్ ఫిక్స్..!!
Follow us on: Google News, Koo, Twitter