కంటెంట్ క్రియేటర్స్ కి గుడ్ న్యూస్: వారి కోసం స్పెషల్ గా HP కొత్త ల్యాప్‌టాప్‌లు

-

HP Envy x360: హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సేవల దిగ్గజ కంపెనీ HP ఇండియాలో కొత్తగా ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌ల పేరు ‘Envy x360’. ఈ వేరియంట్‌లు రూ. 82,999 ప్రారంభ ధరకు లభిస్తాయి. కంటెంట్ క్రియేటర్‌లకు ఇవి బాగా ఉపయోగపడుతాయని కంపెనీ అధికారులు పేర్కొన్నారు. కొత్త Envy x360 ల్యాప్‌టాప్‌లు 15.6-అంగుళాల OLED టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. 88 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో ఎక్కువ స్క్రీన్ కలిగి ఉన్నాయి. అలాగే, 360-డిగ్రీల వరకు రొటేషన్‌ అవుతాయి. మెరుగైన డిస్‌ప్లే క్లారిటీని అందించడానికి  Intel Iris Xe గ్రాఫిక్‌లతో 12వ Gen Intel కోర్ EVO i7, i5 ప్రాసెసర్‌లను కలిగి ఉన్నాయి. కంటిపై ఎఫెక్ట్ కలగకుండా ఉండటానికి ఐసేఫ్ డిస్‌ప్లే‌ను కలిగి ఉంటాయి.

- Advertisement -

అలాగే, ఫ్రీగా టైపింగ్ చేయడానికి ఎమోజి కీబోర్డ్‌ను కంపెనీ అందిస్తుంది. అలాగే, వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం, ల్యాప్‌టాప్‌లో AI నాయిస్ తగ్గింపు, ఆటో ఫ్రేమ్ టెక్నాలజీ వంటి ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో 5MP IR కెమెరాను అమర్చారు. ల్యాప్‌టాప్‌లు ఒక్కసారి చార్జింగ్‌తో 10 గంటల వరకు లైఫ్ ఇస్తాయని కంపెనీ పేర్కొంది. 8GB RAM, 512GB మెమరీ మోడల్ ధర రూ. 82,999. 16GB RAM ధర రూ. 86,999. OLED డిస్ప్లే, కోర్ i7 ప్రాసెసర్, 16GB RAM, 1TB స్టోరేజ్‌తో కూడిన హై-ఎండ్ మోడల్ ధర రూ. 1,14,999. ఇవి కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఇతర స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Read Also:
స్విమ్‌ సూట్‌లో రెచ్చిపోయిన గృహలక్ష్మి సీరియల్ తులసి (వీడియో)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...