Meta launches paid blue tick for instagram, facebook: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ని ఫాలో అయిపోతోంది ‘మెటా’. బ్లూటిక్ కోసం ఇప్పటికే ట్విట్టర్ ప్రతి నెలా వసూలు చేస్తుండగా.. అదే బాటలో చేరనుంది మెటా. Instagram, Facebook లలో పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకొస్తున్నట్లు మార్క్ జూకర్ బర్గ్ ప్రకటించాడు. దీని ద్వారా గవర్నమెంట్ ఐడీ, బ్లూ బ్యాడ్జ్, డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ లాంటివి యూజర్లు పొందనున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లు నెలకు 11.99 డాలర్లు, iOS యూజర్లు 14.99 డాలర్లు చెల్లించాలి.