ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్ పై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా SI ప్రో, S1 X, SI ఎయిర్ వంటి SI రేంజ్ స్కూటర్లపై ఆఫర్లను అనౌన్స్ చేసింది. అయితే ఇవి పరిమిత కాలానికే అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. స్పెషల్ ఆఫర్స్ లో ఓలా S1 రేంజ్ స్కూటర్ల ధరపై వేరియంట్, నగరాన్ని బట్టి రూ.19.500 లేదా అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని పాత పెట్రోల్ స్కూటర్ తో ఎక్స్ చేంజ్ చేసుకుంటే.. రూ.15,000 వరకు ఎక్స్ ట్రా బోనస్ ను పొందవచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీతో టై అప్ ఉన్న కంపెనీలో పని చేస్తే.. రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందుకోవచ్చు. స్కూటర్ కొనడానికి లోన్ తీసుకోవాలనుకుంటే జీరో ప్రాసెసింగ్ ఫీజు, జీరో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంటే ఓలా ఎలక్ట్రిక్ ఫైనాన్సింగ్ పార్టనర్ల నుంచి డబ్బు తీసుకున్నందుకు ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జీలు లేదా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. స్కూటర్ వారంటీని స్టాండర్డ్ 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ కి పొడిగించాలనుకుంటే, ఎక్స్ ట్రా ధరపై 50 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.